‘సుంకిశాల’ పాపం గత ప్రభుత్వానిదే
కాంట్రాక్టరే నిర్మించాల్సింది
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర భారీ, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
సుంకిశాలలో చోటు చేసుకున్న నష్టాన్ని కాంట్రాక్టరే భరిస్తాడని చెప్పారు మంత్రి. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇది కుంగి పోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలోనే సుంకిశాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు .
సుంకిశాల ప్రాజెక్టు పాపం గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంట్రాక్టర్లను ఎంపిక చేసి , పనులు చేయించింది కూడా వారేనని పేర్కొన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కూలి పోయిన ఘటనతో ఎలాంటి సంబంధం లేదన్నారు.
జరిగిన నష్టాన్ని మొత్తం కాంట్రాక్టరే భరించాలని, ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తామేదో తప్పు చేసినట్లు నిరాధారమైన ఆరోపణలు చేయడం కేటీఆర్ కు తగదని మండిపడ్డారు.