NEWSTELANGANA

క‌మీష‌న్ల కోస‌మే ప్రాజెక్టులు క‌ట్టారు

Share it with your family & friends

మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కామెంట్

హైద‌రాబాద్ – గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో చోటు చేసుకున్న అవినీతి అక్ర‌మాల‌పై మ‌రోసారి నోరు విప్పారు నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. కేవ‌లం కమీష‌న్ల కోస‌మే ప్రాజెక్టుల‌ను క‌ట్టారంటూ మండిప‌డ్డారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 1 లక్ష 47వేల కోట్లు కావాలని పేర్కొన్నారు.

కాళేశ్వరంలో 25 వేల కోట్ల పనులు ఎలాంటి డీపీఆర్ లేకుండా పనులు కేటాయించారని ఆరోపించారు. 94 వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు చేశార‌ని , 5 ఏళ్లలో 160 టీఎంసీ నీళ్లను మాత్రమే విడుద‌ల చేశార‌ని తెలిపారు.

ఇరిగేషన్ కోసం ఉపయోగించింది 65 టీఎంసిలు మాత్రమేన‌ని పేర్కొన్నారు. ప్రతీ ఏటా కాళేశ్వరం నుంచి 6 లక్షల 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన త‌ప్పులను క‌ప్పి పుచ్చుకునేందుకు నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని ఆరోపించారు.

మేడిగడ్డను ఎన్డీఎస్ఏకు అప్ప‌గించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇచ్చిన నివేదిక ఆధారంగా భ‌విష్య‌త్ లో చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలతో పాటు కేసీఆర్ వెళ్లి చూసి రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.