గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు బంపర్ ఆఫర్
మరాఠా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆహ్వానం
ముంబై – ఇంటర్నేషనల్ గ్యాంగ్ స్టర్ గా గుర్తింపు పొందిన లారెన్స్ బిష్ణోయ్ దేశ వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారాడు. ఓ రాజకీయ పార్టీ ఏకంగా పోటీ చేయాలంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు మహారాష్ట్రకు చెందిన ఉత్తర భారతీయ వికాస్ సేవ అనే పార్టీ తమ పార్టీ తరపున టికెట్ ఇస్తామని, ప్రస్తుతం రాష్ట్రంలో జరిగే శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరింది.
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్ జైలులో ఉన్నారు. మరాఠా పార్టీ ఆహ్వానం పలకడం విస్తు పోయేలా చేసింది. పార్టీ తరపున పోటీ చేస్తే అన్నింటిని తామే చూసుకుంటామని, ఖర్చుకు సంబంధించినవన్నీ భరిస్తామని స్పష్టం చేసింది ఉత్తర భారతీయ వికాస్ సేవ పార్టీ.
లారెన్స్ బిష్ణోయ్ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపాదనను అంగీకరించాల్సిందిగా కోరుతూ వారు సబర్మతి సెంట్రల్ జైలుకు లేఖ పంపారు. వెంటనే ఓకే చేయాలని లారెన్స్ బిష్ణోయ్ ను కోరారు. ఇదిలా ఉండగా ఇటీవలే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన మాజీ మంత్రి బాబా సిద్దిఖ్ ను లారెన్స్ గ్యాంగ్ కు చెందిన టీం పాల్గొన్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ గా మారారు లారెన్స్ బిష్ణోయ్.