అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ దూకుడు
72 స్థానాలలో కమలా హారీస్ విజయం
అమెరికా – యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ దూసుకు పోతున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ట్రంప్ 111 స్థానాల్లో విజయం సాధించగా కమలా హారీస్ 72 స్థానాలను కైవసం చేసుకున్నారు. అమెరికా దేశ అధ్యక్ష పదవి దక్కించు కోవాలంటే కనీసం 272 స్థానాలలో గెలుపొందాల్సి ఉంటుంది.
అమెరికా దేశంలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పటికు వెలువడిన ఫలితాలలో 9 రాష్ట్రాలలో డొనాల్డ్ ట్రంప్ పార్టీ విక్టరీ నమోదు కాగా 5 రాష్ట్రాలలో కమలా పార్టీ గెలుపొందింది. ఇంకా 36 రాష్ట్రాలలో రిజల్ట్ట్స్ వెలువడాల్సి ఉంది.
ఇదిలా ఉండగా తాజాగా వస్తున్న ఎన్నికల ఫలితాలపై స్పందించారు డొనాల్డ్ ట్రంప్. తాము గెలవడం ఖాయమని, అధ్యక్ష స్థానం తనదేనంటూ ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు డొనాల్డ్ ట్రంప్. మరో వైపు కమలా హారీస్ మాత్రం తమకు పూర్తి నమ్మకం ఉందని, ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.