సీఎంపై వీహెచ్ షాకింగ్ కామెంట్స్
ప్రజా పాలన కాదు దొరల పాలన
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్ హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొలువు తీరిన తమ ప్రభుత్వంపై ఆయనే కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ప్రజా పాలన సాగడం లేదని, దొరల పాలన సాగుతోందని ఆరోపించారు.
శనివారం గాంధీ భవన్ లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. ఇకనైనా రేవంత్ రెడ్డి తన పాలనా తీరును మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో భూ కబ్జాల పర్వం కొనసాగూతనే ఉందని, ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారంటూ నిలదీశారు.
బీఆర్ఎస్ పాలనలో పేదల భూములను దొరలకు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో మాదిగలకు 94 ఎకరాల భూమిని 10 మందికి కీసరలో ఇచ్చిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ రావడంతో రాగి కృష్ణా రెడ్డి అనే వ్యక్తి ఫోర్జరీ సంతకాలు చేసి పట్టాలు చేయించుకున్నాడని ఆరోపించారు. అయినా రేవంత్ రెడ్డి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు.