NEWSTELANGANA

భ‌ట్టికి కృత‌జ్ఞ‌త లేదు – వీహెచ్

Share it with your family & friends

రేవంత్ సీఎం అవుతాడ‌న్న

హైద‌రాబాద్ – కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు వీ హ‌నుమంత రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌పై ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త అన్న‌ది లేదన్నారు. ఓ ఛాన‌ల్ తో పిచ్చాపిటి మాట్లాడారు వీహెచ్.

సీఎంగా రేవంత్ రెడ్డి అవుతాడ‌ని తాను ముందే చెప్పాన‌ని అన్నారు. దీంతో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క త‌న‌పై కోపం పెంచుకున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌న ముందు అత‌డెంత అని అన్నారు. అస‌లు భ‌ట్టిని రాజ‌కీయాల్లోకి తీసుకు వ‌చ్చిందే తాన‌ని అన్నారు వీహెచ్ హ‌నుమంత రావు.

మ‌ల్లు ర‌వికి తాను టికెట్ ఇప్పిస్తే భ‌ట్టి త‌న కాళ్లు మొక్కిండ‌ని ఆ విష‌యం కూడా మ‌రిచి పోయి ఇప్పుడు ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని ఆరోపించారు. ఖ‌మ్మం టికెట్ త‌న‌కు రాకుండా భ‌ట్టి ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. అయినా తాను ఎవ‌రికీ జ‌వాబుదారీ కాన‌ని అన్నారు. కేవ‌లం పార్టీ హై క‌మాండ్ కు మాత్ర‌మే తాను ఆన్స‌ర్ ఇస్తాన‌ని అన్నారు .

ప్ర‌స్తుతం భ‌ట్టి మీద వీహెచ్ చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.