ఎన్ హెచ్ ఆర్ సీ చైర్మన్ గా రామ సుబ్రమణియన్
నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీ – జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కొత్త చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ రామసుబ్రమణియన్ ను నియమించారు. ఆయనతో పాట. ప్రియాంక్ కనూంగో , డాక్టర్ జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి (రిటైర్డ్) కూడా కమిషన్ సభ్యులుగా నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రపతి భవన్ కార్యాలయం.
జస్టిస్ రామసుబ్రమణియన్ 23 సెప్టెంబర్ 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు . ఆయన స్వస్థలం తమిళనాడు . 2023 జూన్ 29న పదవీ విరమణ చేశారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్‌పర్సన్‌గా తన పదవీకాలాన్ని ఈ ఏడాది జూన్ 1వ తేదీన ముగించిన నెలల తర్వాత ఈ నియామకం జరిగింది. మిశ్రా పదవీ విరమణ తర్వాత విజయ భారతి సయానీ మానవ హక్కుల ప్యానెల్‌కు తాత్కాలిక చైర్‌పర్సన్ అయ్యారు. ఇదిలా ఉండగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రామ సుబ్రమణియన్ తో పాటు సభ్యులను ఎంపిక చేసేందుకు రాష్ట్రపతి పరిశీలిన నిమిత్తం ప్రతిపాదనలు పంపించింది.