NEWSTELANGANA

గౌడ్ లు వ్యాపార‌వేత్త‌లుగా రాణించాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్

హైద‌రాబాద్ – గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు వ్యాపార‌వేత్త‌లుగా ఎద‌గాల‌ని పిలుపునిచ్చారు మాజీ మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్. శ‌నివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ లో గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్ (GBN) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 100వ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్బంగా వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

గౌడ బిజినెస్ నెట్ వ‌ర్క్ ను ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల మాజీ మంత్రి అభినందించారు. ఈ నెట్ వ‌ర్క్ ను ఏర్పాటు చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ప్ర‌భాక‌ర్ ను ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు వి. శ్రీ‌నివాస్ గౌడ్. గ‌తంలో కంటే ఇప్పుడు ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయ‌ని, వాటిని గుర్తించి స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.

గ‌త 10 ఏళ్ల బీఆర్ఎస్ హ‌యాంలో ఎన్నో వినూత్న‌మైన కార్య‌క్ర‌మాల‌ను తీసుకు రావ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌త్యేకించి టీ హ‌బ్ ద్వారా ఔత్సాహికుల‌కు, విభిన్న‌మైన ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌చ్చే వారికి తోడ్పాటుతో పాటు శిక్ష‌ణ‌, మెళ‌కువ‌ల‌ను, ఆర్థిక సాయం కూడా చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

ఎవరైనా కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌స్తే త‌ప్ప‌కుండా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు.