ఫోటో..వీడియో గ్రాఫర్లకు భరోసా
శ్రీనివాస్ గౌడ్..కోమటిరెడ్డి హాజరు
హైదరాబాద్ – తెలంగాణ ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి మాజీ మంత్రివర్యులు, ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమం లో పాల్గొన్నఫోటో, వీడియో గ్రాఫర్లను గౌడ్, రెడ్డిలు ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా వరదలతో సర్వస్వం కోల్పోయిన కుటుంబానికి, ప్రమాదానికి గురైన ఫోటో, వీడియో గ్రాఫర్ కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు.
భవిష్యత్తులో ప్రతి ఒక్కరికీ భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. తమ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటుందని స్పష్టం చేశారు . ఇదే సమయంలో తెలంగాణ ఫోటో, వీడియో గ్రాఫర్లను ఆదుకోవాలని, వారికి సామాజిక, ఆరోగ్య , జీవిత భద్రత కల్పించాలని కోరారు మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్.