పట్టు వీడండి జీవో29 రద్దు చేయండి
విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ ప్రకటన
హైదరాబాద్ – మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులు, నిరుద్యోగుల పట్ల కక్ష సాధింపు ధోరణి మంచిది కాదన్నారు. ఇది సర్కార్ కు మంచిది కాదన్నారు.
విద్యార్థులు, నిరుద్యోగులు, ఆశావహులు చేస్తున్న న్యాయ పరమైన డిమాండ్ సరైనదేనని పేర్కొన్నారు. ఆయన వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారికి రాజకీయాలను అంటగట్టడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వం చేయలేని పక్షంలో ప్రతిపక్షాలు తప్పకుండా మద్దతు ఇస్తాయని స్పష్టం చేశారు. వారి పక్షాన తమ పార్టీ తప్పకుండా సపోర్ట్ గా ఉంటుందని చెప్పారు విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్.
టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ సర్కార్ అభ్యర్థుల ఆందోళనను మానవతా దృక్ఫథంతో అర్థం చేసుకోవాలని సూచించారు. ఇది ఎంత మాత్రం సబబు కాదన్నారు మాజీ మంత్రి. అభ్యర్థుల భవితవ్యం ప్రశ్నార్థం కాకూడదన్నారు. కచ్చితంగా జీవో29ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్. పార్టీలకు ఆపాదిస్తే ఎలా అని ప్రశ్నించారు.