మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ – మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హోంగార్డులను మోసం చేసిందన్నారు. రూ. 79 పెంచి రూ. 1000 పెంచామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
తాము అధికారంలో ఉన్నప్పుడే హోం గార్డులకు ప్రభుత్వ భీమా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఆనాడు రూ. 9 వేల జీతం వచ్చేదన్నారు. ప్రతి సంవత్సరం అదనంగా రూ. 1000 పెంచాతమని ఆనాడే ప్రకటించామన్నారు శ్రీనివాస్ గౌడ్.
20 వేలకు జీతం పెంచి, తరువాత వారికి పీఆర్సీ 30 శాతం పెంచడం జరిగిందన్నారు మాజీ మంత్రి. హోమ్ గార్డుల జీతాలు పెంచిన ఘనత తమ నాయకుడు కేసీఆర్ మాత్రమేనని అన్నారు.
ట్రాఫిక్ పోలీస్ డ్యూటీ, అన్ని విభాగాల్లో హోమ్ గార్డులు విధులు నిర్వర్తించే వారని తెలిపారు. ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ లలో పని చేసే వారికి 30 శాతం రిస్క్ అలవెన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. పోలీస్ లతో సమానంగా డ్రెస్ అలవెన్స్, ప్రత్యేకంగా సెలవులు ఇచ్చామన్నారు.
వారిని రెగ్యులరైజ్ చేయాలని రాజీవ్ త్రివేది నేతృత్వంలో కమిటీ వేయడం జరిగిన విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. వాళ్ళను ఈ ప్రభుత్వం స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ లుగా నియామక ప్రక్రియ చేస్తారని అనుకున్నారు వి. శ్రీనివాస్ గౌడ్. స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ లుగా వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. .
చనిపోయిన హోమ్ గార్డులకు రూ. 10 లక్షల ఏక్షగ్రేషియా ఇవ్వాలని కోరారు. రిటైర్ అయిన హోమ్ గార్డులకు కూడా బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. పోలీసులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా హోమ్ గార్డులకు కూడా వర్తించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.