కాంగ్రెస్ సర్కార్ పై కన్నెర్ర
రైతులను ఆదుకోక పోతే పోరు బాట
పాలమూరు జిల్లా – బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పిలుపు మేరకు గురువారం బీఆర్ఎస్ ఆద్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లలో పెద్ద ఎత్తున గులాబీ నేతలు ఆందోళన బాట పట్టారు. ప్రధానంగా వరి పంటకు మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా విఫలం అయ్యారంటూ మండిపడ్డారు.
జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, నేతలు, ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని అన్నారు. రైతు బంధు ద్వారా ఆదుకున్నామని, పంటకు కనీస మద్దతు ధర కల్పించడం జరిగిందన్నారు.
కానీ ఆరు గ్యారెంటీల పేరుతో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఫక్తు నాటకాలకు తెర లేపిందన్నారు. రైతులకు చుక్కలు చూపిస్తోందని, దీంతో వారికి భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.