SPORTS

వైభ‌వ్ వ‌య‌సుపై ఆరోప‌ణ‌లు అబ‌ద్దం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన యంగ్ క్రికెట‌ర్ తండ్రి

హైద‌రాబాద్ – ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యంత పిన్న వ‌య‌సు క‌లిగిన క్రికెట‌ర్ గా బీహార్ కు చెందిన వైభ‌వ్ సూర్య వంశీ రికార్డ్ సృష్టించాడు . త‌ను వేలం పాట‌లో రూ. 30 ల‌క్ష‌ల బేస్ ధ‌ర‌కు రాగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అత‌డిని రూ. 1 కోటి 10 ల‌క్ష‌ల‌కు తీసుకుంది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చనీయాంశంగా మారాడు ఈ కుర్రాడు.

కాగా చాలా మంది అత‌డికి 15 ఏళ్లు ఉంటాయ‌ని, వ‌య‌సు త‌క్కువ చేసి చూపిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. దీనిపై తీవ్రంగా స్పందించాడు వైభవ్ సూర్య వంశీ తండ్రి. త‌న‌కు స‌రిగ్గా 13 ఏళ్ల 8 నెల‌లు నిండాయ‌ని చెప్పాడు.

త‌న స్వంతూరు బీహార్ లోని స‌మ‌స్తిపూర్ ప‌ట్ట‌ణానికి 15 కిలోమీట‌ర్ల దూరంలోని స్వ‌స్థ‌లం మోతీపూర్. తండ్రి రైతు. వ్య‌వ‌సాయ‌మే జీవ‌నాధారం. వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న కొడుకు కాద‌ని బీహార్ రాష్ట్రానికి చెందిన త‌న‌యుడంటూ స్ప‌ష్టం చేశాడు.

నా కొడుకు చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. 8 ఏళ్ల వ‌య‌సులో అండ‌ర్ 16 జ‌ట్ట‌కు ఆడాడు. స‌మస్తిపూర్ లో కోచింగ్ కు తీసుకు వెళ్లి వ‌చ్చాన‌ని అన్నాడు. నా కొడుకు కోసం భూమిని అమ్మాను. ఇప్ప‌టికీ ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని వాపోయాడు. మేం ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికీ ప‌రీక్ష చేయించు కోవ‌చ్చ‌ని తెలిపాడు.