33 బంతులు 57 రన్స్ 4 ఫోర్లు 4 సిక్స్ లు
చెన్నై – మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడు పోతూ పోతూ బీహార్ కు చెందిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ. తనపై నమ్మకం పెట్టుకున్న కోచ్ రాహుల్ ద్రవిడ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఐపీఎల్ 18వ సీజన్ లో తను సూపర్ షో తో అదరగొట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనకు ఎదురే లేదని చాటాడు. సీనియర్లు జడుసుకునేలా ఆడాడు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు. గ్రౌండ్ నలుమూలలా దంచి కొట్టాడు. చెన్నై బౌలర్ల భరతం పట్టాడు. కేవలం 33 బాల్స్ ఎదుర్కొన్నాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్స్ లు ఉన్నాయి. 57 రన్స్ చేశాడు. కెప్టెన్ శాంసన్ తో కలిసి 2వ వికెట్ కు 98 పరుగులు జోడించారు.
మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్యాన్ని రాజస్థాన్ 17.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. సూర్య వంశీ , శాసన్ , జురైల్ దుమ్ము రేపారు. కెప్టెన్ శాంసన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యవంశీ, సంజూ కలిసి రెండో వికెట్ కు 58 బంతుల్లో 98 పరుగులు జోడించారు. 41 రన్స్ చేయగా రియాన్ పరాగ్ నిరాశ పరిచాడు. మైదానంలోకి వచ్చిన ధ్రువ్ జురేల్, హెట్మెయిర్ కలిసి గెలుపు బాట పట్టించారు. జురైల్ దంచి కొట్టాడు. అంతకు ముందు జైశ్వాల్ 36 పరుగులతో విరుచుకు పడ్డాడు.