సోషల్ మీడియాలో సంచలనం
చెన్నై – ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై వేదికగా చెన్న సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ సూపర్ షో చేసింది. కేవలం 17.1 ఓవర్లలోనే దుమ్ము రేపింది. చెన్నైకి ఝలక్ ఇచ్చింది. గౌరవ ప్రదంగా 18వ ఐపీఎల్ సీజన్ నుంచి నిష్క్రమించింది. భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ ఆకాశమే హద్దుగా రెచ్చి పోయారు.
యశస్వి జైశ్వాల్ 36 రన్స్ చేస్తే కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొని 4 ఫోర్లు 4 సిక్సర్లతో రెచ్చి పోయాడు బీహార్ కుమార్ యంగ్ స్టార్ క్రికెటర్ వైభవ్ సూర్య వంశీ 57 రన్స్ చేశాడు. తన జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ తో కలిసి 2వ వికెట్ కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మ్యాచ్ అనంతరం మైదానంలో ఫ్యాన్స్ సాక్షిగా వైభవ్ సూర్య వంశీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాదాలను తాకేందుకు ప్రయత్నం చేశాడు. దీనిని అడ్డుకోబోయాడు జార్ఖండ్ డైనమెట్. అయినా వినిపించు కోలేదు. తన పాదాలను తాకాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం హల్ చల్ల చేస్తున్నాయి.