NEWSTELANGANA

సీఎంను క‌లిసిన జ్యోతిబా పూలే విద్యార్థులు

Share it with your family & friends

మీకు అండ‌గా ఉంటాన‌ని రేవంత్ రెడ్డి భ‌రోసా

హైద‌రాబాద్ – రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే విద్యా సంస్థ‌లకు తీపి క‌బురు చెప్పింది. ఈ సంద‌ర్బంగా ఇవాళ
ఖమ్మం జిల్లా వైరా, మధిర నియోజకవర్గాల నుండి మహాత్మా జ్యోతిబా పూలే సాంఘీక సంక్షేమ హాస్టల్స్ పాఠశాల, కళాశాల విద్యార్థులు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆయ‌న నివాసంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. వారి వెంట ఖ‌మ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర రెవిన్యూ, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఉన్నారు.

ఇటీవల ప్రభుత్వం డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం పట్ల ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా విద్య పట్ల ప్రజా ప్రభుత్వ ఆలోచన, సమాజంలో విద్య ప్రాధాన్యత పై వారితో ముచ్చటించారు ముఖ్య‌మంత్రి. కేవలం అకడమిక్ విద్య మాత్రమే కాక, నైపుణ్యాలను మెరుగు పరుచు కోవడం, క్రీడల్లో రాణించాల్సిన అవసరం, ఆవశ్యకత గురించి వారికి
సూచనలు, సలహాలు ఇచ్చారు.

రేపటి తెలంగాణ మ‌ద్యానికి, గంజాయికి, చెడు అల‌వాట్ల‌కు దూరంగా…చైతన్యానికి కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి.