విజయవాడ జిల్లా జైలుకు తరలింపు
అమరావతి – గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఆయనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి ప్రోత్సహించిన ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకుంది. పోలీసులు నోటీసులు జారీ చేసినా పట్టించుకోక పోవడంతో హైదరాబాద్ లో ఉంటున్న వంశీని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్ కు కూడా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వీరిని విజయవాడ లోని జిల్లా జైలుకు తరలించారు. గచ్చిబౌలి నుంచి భారీ భద్రత మధ్య వంశీని బెజవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి జీజీహెచ్ కు తరలించారు. దాదాపు 8 గంటలకు పైగా వంశీని ప్రశ్నించారు పోలీసులు.
పడమట పోలీస్ స్టేషన్ లో సత్యవర్థన్ స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. తనను కిడ్పాప్ చేసిన ఘటనలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఏ7 ఎలినేని శివరామకృష్ణ, ఏ8 లక్ష్మీపతిని చేర్చారు.