జీవో నెంబర్ 46 రద్దు చేస్తాం
ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా – ఏఐసీసీ కార్యదర్శి, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో జీవో నెంబర్ 46 గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మండి పడుతున్నారు.
దీనిని గమనించిన వంశీ చందర్ రెడ్డి నిరుద్యోగుల నుంచి ముప్పు ముంచి ఉందని గ్రహించారు. ఈ మేరకు తాను మీ అందరి తరపున సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు చల్లా వంశీ చంద్ రెడ్డి. పాలమూరు న్యాయ్ యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా ఆయన ప్రసంగించారు.
జీవో నెంబర్ 46ను గత సర్కార్ తీసుకు వచ్చిందని, దీని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. కానీ తమ సర్కార్ వచ్చిన వెంటనే దీనిపై రివ్యూ చేస్తున్నామని, త్వరలోనే రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయడం ఖాయమని జోష్యం చెప్పారు.
ఇక నుంచి నిరుద్యోగులు నష్ట పోకుండా చూస్తామని స్పష్టం చేశారు . అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చూస్తామన్నారు.