బరిలో ఎవరున్నా గెలుపు నాదే
వైసీపీ ఇన్ ఛార్జ్ వంగా గీత
అమరావతి – పిఠాపురం వైసీపీ ఇన్ ఛార్జ్ వంగా గీత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని, ఎవరు బరిలో ఉన్నా చివరి గెలుపు తనదేనని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని శాసన సభ ఎన్నికల్లో బరిలో ఉంటానని ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా వెల్లడించారు పవన్ కళ్యాణ్. ఆయనకు షాక్ ఇస్తూ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటానని స్పష్టం చేశారు ఆర్జీవీ. ఆయన ముందు నుంచీ మెగాస్టార్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. చిరంజీవి, నాగ బాబు, పవన్ కళ్యాణ్ లను ఏకి పారేస్తూ వస్తున్నారు. ఆయన బహిరంగంగానే ఏపీలో కొలువు తీరిన సీఎం జగన్ రెడ్డికి మద్దతు ఇస్తూ వచ్చారు. మొత్తంగా పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.