పవన్ ఓడి పోవడం పక్కా
వైసీపీ అభ్యర్థి వంగా గీత
పీఠాపురం – ఏపీలో ఎన్నికల నగారా మోగింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రస్తుతం అందరి కళ్లు పిఠాపురం పైనే ఉన్నాయి. దీనికి కారణం ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీలోకి దిగడమే. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగా గీతను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓటుకు లక్ష రూపాయలు పంపిణీ చేసినా చివరకు గెలిచేది తానేనని జోష్యం చెప్పారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు వంగా గీత. ఆరు నూరైనా సరే పిఠాపురం లో గెలిచేది తానేనని, జనసేనాని పరాజయం పాలు కావడం పక్కా అని స్పష్టం చేశారు. ఎవరు ఎలాంటి వారనేది ఇక్కడి ప్రజలకు బాగా తెలుసన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో జగన్ రెడ్డి సారథ్యంలో సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు.
తమ నవ రత్నాలే తమను గట్టెక్కించేలా చేస్తాయని స్పష్టం చేశారు వంగా గీత. అయితే పదే పదే పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడి లాగా మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఇకనైనా ముందు వెనుకా ఆలోచించి మాట్లాడితే బెటర్ అని సూచించారు వంగా గీత.