ENTERTAINMENT

మెగాస్టార్ కు వంగా అభినంద‌న

Share it with your family & friends

ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు గ్ర‌హీత‌కు థ్యాంక్స్

హైద‌రాబాద్ – భార‌త దేశంలో అత్యున్న‌త‌మైన రెండో పౌర పుర‌స్కారం ప‌ద్మ విభూష‌ణ్ ను మెగాస్టార్ చిరంజీవికి ప్ర‌క‌టించింది మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం . త్వ‌ర‌లో ఎన్నిక‌లు జర‌గ‌నున్నాయి. ఓ వైపు త‌మ్ముడు ప‌వన్ క‌ళ్యాణ్ బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఇక చిరంజీవి ఇప్పుడు పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేడు. ఇదే స‌మ‌యంలో కొంత‌లో కొంతైనా మెగా ఫ్యామిలీ అభిమానుల నుంచి ఓట్లు రాలుతాయ‌ని ప్లాన్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.

మొత్తంగా సినీ రంగంలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నారు చిరంజీవి. ఆయ‌న 150కి పైగా సినిమాల‌లో న‌టించారు. మెగాస్టార్ గా గుర్తింపు పొందారు. ఇదే స‌మ‌యంలో బీజేపీలో కీల‌క‌మైన నాయ‌కుడిగా పేరున్న మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు కు కూడా కేంద్ర స‌ర్కార్ ప‌ద్మ విభూష‌ణ్ ప్ర‌క‌టించింది. మొత్తం కేంద్రం 132 ప‌ద్మ పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉండ‌గా అత్యున్న‌త‌మైన పుర‌స్కారం ప‌ద్మ విభూష‌ణ్ గా ఎంపికైన మెగాస్టార్ చిరంజీవిని ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి అభినందించారు.