శ్రీవారి సన్నిధిలో వంగా
స్వామిని దర్శించుకున్న డైరెక్టర్
తిరుమల – ప్రముఖ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి సంచలనంగా మారారు. ఆయన కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమల పుణ్య క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు.
ఆయన ఇటీవలే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రణ బీర్ కపూర్ , బాబీ డియోల్, అనిల్ కపూర్ తో కలిసి యానిమల్ మూవీ తీశాడు. ఇది దేశాన్ని ఒక ఊపు ఊపింది. ఓ వైపు ప్రశాంత్ నీల్ మూవీతో పోటీ పడింది. ఈ చిత్రానికి భారీ ఎత్తున ఆదరణ లభించింది.
తండ్రీ, కొడుకుల మధ్య రిలేషన్ షిప్ ను పాయింట్ గా తీసుకుని యానిమల్ ను తెర కెక్కించాడు వంగా సందీప్ రెడ్డి. రూ. 300 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం రికార్డులను బద్దలు కొట్టింది. బాలీవుడ్ కు మంచి కిక్కు ఇచ్చేలా చేసింది. ఏకంగా సినీ క్రిటిక్స్ అంచనా ప్రకారం యానిమల్ ఏకంగా రూ. 1000 కోట్ల మార్క్ ను దాటేసిందని . ఏది ఏమైనా వంగా సందీప్ రెడ్డి తిరుమలను దర్శించు కోవడం హాట్ టాపిక్ గా మారింది.
మొక్కులో భాగంగా స్వామి వారికి తల నీలాలు సమర్పించు కోవడం విశేషం.