టీడీపీ చీఫ్ కు అనిత అభినందన
నూతన పార్టీ అధ్యక్షుడికి కంగ్రాట్స్
అమరావతి – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావును అభినందించారు. ఆయన నారా లోకేష్ సమక్షంలో పార్టీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా అనిత ప్రత్యేకంగా ఆయనను కలుసుకుని కంగ్రాట్స్ తెలిపారు.
వీరిద్దరి మధ్య కీలకమైన అంశాలు చర్చకు వచ్చాయి. పార్టీ కోసం కష్ట పడిన వారిని తప్పక ఆదుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా గత జగన్ రెడ్డి పాలనలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులపై కావాలని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని, \వేలాది మందిపై కేసులు నమోదు చేశారని ఈ సందర్బంగా ప్రస్తావించారు టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు.
దీనిపై స్పందించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి. ఈ అంశంపై ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. సమీక్ష నిర్వహించి ఎవరెవరిపై ఎన్నెన్ని కేసులు ఉన్నాయి, వాటిని ఏ సమయంలో ఎందుకు వాడారో అనే దానిపై ఆరా తీస్తానని హామీ ఇచ్చారు. పార్టీకి నేతలు, కార్యకర్తలే ముఖ్యమన్నారు.