దాడులు చేస్తే చర్యలు తప్పవు
హెచ్చరించిన ఏపీ హోం మంత్రి
అమరావతి – ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఏపీ రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. విశాఖపట్టణంలో యువకుడి దాడిలో గాయపడి సెవన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పారావును ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు భరోసా ఇచ్చారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ కు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా వారి భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు.
రేయింబవళ్లు ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న పోలీసులపై దాడులకు దిగడం మంచి పద్దతి కాదన్నారు. ఏది ఏమైనా కానిస్టేబుల్ అప్పారావుపై దాడి చేయడం దారుణమన్నారు. ఈ సందర్బంగా ఆమె బాధను వ్యక్తం చేశారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వంగలపూడి అనిత పేర్కొన్నారు.