జగన్ శవ రాజకీయాలు మానుకో
ప్రజలు ఛీ కొట్టినా బుద్ది రాలేదు
అమరావతి – ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. ప్రజలు షాక్ ఇచ్చినా ఇంకా బుద్ది రాక పోవడం దారుణమన్నారు. శవ రాజకీయాలు మానుకుంటే మంచిదని సూచించారు.
జగన్ మోహన్ రెడ్డి నంగనాసి కబుర్లు మాట్లాడితుంటే విడ్డూరంగా ఉందన్నారు. తను సీఎంగా ఉన్న కాలంలో రాచరిక పాలన సాగించాడని, అందుకే ప్రజలు తనను, తన పార్టీని, పరివారాన్ని ఛీ కొట్టారని ఎద్దేవా చేశారు వంగలపూడి అనిత.
వినుకొండలో వ్యక్తిగత కారణాలతో హత్య జరిగితే దానిని తామే చేయించినట్టు ఆరోపణలు చేయడం సిగ్గు చేటు అన్నారు. తన హయాంలో జరిగిన రాజకీయ హత్యలకు ముందు తను జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు .
జగన్ మోహన్ రెడ్డి అబద్దాలకు కేరాఫ్ అని, ఏం ముఖం పెట్టుకుని ఢిల్లీలో ధర్నా చేస్తారో చెప్పాలన్నారు. ఎవరిని ఉద్దరించారని తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక రాజకీయ హత్యలు కేవలం నాలుగు మాత్రమే జరిగాయన్నారు వంగలపూడి అనిత.