పాయకరావు పేట నుంచే ప్రక్షాళన
ప్రకటించిన హోం శాఖ మంత్రి
అమరావతి – రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం పాయకరావుపేట నియోజకవర్గ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. పాయకరావుపేట నుండే ప్రక్షాళన చేస్తానని హెచ్చరించారు. పంచాయతీ రాజ్ అతిథి గృహం నిర్వహణ పై మండి పడ్డారు.
తన కోసం పని చేయాలని ఏనాడూ అడగనని, కానీ ప్రజల కోసం మాత్రం పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సేవ చేయాల్సింది ప్రజలకి , జీతం తీసుకునేది వారి డబ్బులు అని గుర్తుంచు కోవాలన్నారు. హోం మంత్రి ఉన్న నియోజకవర్గ పరిధిలోన పని చేయడం మీ అదృష్టమో లేక దురదృష్టమో మీకే తెలియలన్నారు.
ప్రతీ సమస్య కు పరిస్కారం అనేది ఉంటుందన్నారు. పరిస్కారం లేని సమస్యలు అంటూ ఉండవన్నారు. పైలెట్ ప్రాజెక్టు గా పాయకరావుపేటని తీర్చిదిద్దుతానని ప్రకటించారు వంగలపూడి అనిత.
తన పేరు చెప్పి అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వొద్దని, వారికి సంబంధించిన సమాచారం తనకు తెలియ చేయాలని అన్నారు.