రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు
స్పష్టం చేసిన హోం శాఖ మంత్రి
అమరావతి – ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ గురించి ప్రకటించారు. దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది.
ఈ సందర్బంగా గత వైసీపీ సర్కార్ హయాంలో తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలు, అభిమాలను వేధింపులకు గురి చేసిన పోలీసు ఉన్నతాధికారుల గురించి మండిపడ్డారు. ప్రత్యేకించి తాము అధికారంలోకి వచ్చి బదులు తీర్చుకుని తీరుతామంటూ హెచ్చరించారు నారా లోకేష్.
ఈ సందర్బంగా రెడ్ బుక్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు వంగలపూడి అనిత. రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు చర్య కానే కాదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్ మెంట్ అవసరం ఉందన్నారు. ప్రత్యేకంగా భర్తీ విధానం ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు రాష్ట్ర హోం శాఖ మంత్రి.