మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్
అమరావతి – మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి బడ్జెట్ లో హోం శాఖకు ప్రత్యేకంగా కేటాయింపులు ఉంటాయన్నారు. ఫోరెన్సిక్ కు ఊతం ఇస్తామని, ఫింగర్ ప్రింట్ కు ప్రాణం పోస్తామన్నారు. అప్పా, ఆక్టోపస్, గ్రే హౌండ్స్ ఏర్పాటుకు నిధులివ్వాలని ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఈగల్ వ్యవస్థ, జైళ్ల నిర్మాణం, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
ఇన్వెస్టిగేషన్ ఛార్జీల అంచనాను పెంచాలని కోరామన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో పోలీస్ శాఖను బలోపేతం చేస్తామన్నారు.
వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. అన్ని ఆధారాలతోనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నేతలు ఈ ఎనిమిది నెలల కాలంలో ఎన్నిసార్లు వెళ్లారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో వంశీ చేసిన అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. పక్కా ప్రూఫ్స్ తోనే తనను అదుపులోకి తీసుకున్నారని అన్నారు వంగలపూడి అనిత.
కూటమి నాయకులను అరెస్ట్ చేస్తే సక్రమం వైసీపీ నేతలైతే అక్రమం ఎట్లా అవుతుందని ప్రశ్నించారు.
గుర్రంకొండలో యువతి యాసిడ్ దాడి ఘటన కలచి వేసిందన్నారు. వీడియో కాల్ చేసి మాట్లాడి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చామని చెప్పారు హోం శాఖ మంత్రి.