ఏర్పాటు చేశామన్న మంత్రి వంగలపూడి
అమరావతి – గత వైసీపీ ప్రభుత్వ మయాంలో గంజాయి సాగు, రవాణా విచ్చలవిడిగా సాగిందని ఆరోపించారు మంత్రి వంగలపూడి అనిత. తమ కూటమి సర్కార్ వచ్చాక ఉక్కుపాదం మోపామన్నారు. ఎక్కడ కూడా సాగు, రవాణా చేయకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందు కోసం జీవోను తీసుకు వచ్చామని, ఐజీ స్థాయి అధికారికి ఈగల్ కు చీఫ్ గా నియమించామన్నారు. ఈసారి బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయింపులు చేపట్టామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు అనిత. 11 వేల ఎకరాల గంజాయి సాగును 100 ఎకరాలకు నియంత్రించామన్నారు. ఏపీలోని 7 మండలాల్లోని 375 గ్రామాల్లో 20 హాట్ స్పాట్ లను గుర్తించి సాగు లేకుండా చేశామని ప్రకటించారు.
గంజాయి సాగుకు అలవాటుపడిన కుటుంబాలను కౌన్సిలింగ్ చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహించామన్నారు. 359 కుటుంబాలు ఇపుడు గంజాయికి బదులు ఇతర పంటలను పండిస్తున్నాయని తెలిపారు.
పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి రవాణాను అరికడుతున్నామన్నారు. 40,088 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 564 గంజాయిని రవాణా చేసే వాహనాలను సీజ్ చేశామన్నారు.
ఏపీలో సాగు కన్నా గంజాయి రవాణా ఎక్కువ జరగుతోందన్నారు. హోం, ఈగల్ ఆధ్వర్యంలో అంతర్గత సమన్వయ సమావేశం కోసం స్టేట్ లెవల్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు . డ్రై గంజాయి, లిక్విడ్ గంజాయి, గ్లూస్ వంటి పదార్థాలపై నిఘా పెట్టామన్నారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో స్కూళ్లలోనూ ఈగల్ కమిటీల ఏర్పాటు చేశామన్నారు. ఫిబ్రవరి 10న ప్రభుత్వం మరో జీవో కూడా జారీ చేసిందన్నారు. గంజాయి సమాచారం అందిన వెంటనే టీచర్లు, ప్రిన్సిపల్ నేతృత్వంలో డీఎడిక్షన్ సెంటర్లలో చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు వంగలపూడి అనిత.