ఏపీలో శాంతి భద్రతలకు ఢోకా లేదు
హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని, దీనికి బాధ్యత వహిస్తూ గాను మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి డిమాండ్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.
ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆమె తీవ్రంగా స్పందించారు. పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తున్నట్లు ఎంపీకి నిరాధారమైన ఆరోపణలు చేయడం, ఎదుటి వారిని కించ పరిచేలా కామెంట్స్ చేయడం, వ్యక్తిగతంగా దూషణలకు దిగడం అలవాటుగా మారిందని మండిపడ్డారు అనిత.
వయసుకు తగ్గట్టు వ్యాఖ్యలు చేస్తే మంచిదని హితవు పలికారు. గతంలో వైసీపీ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉండేదో ఇప్పుడు టీడీపీ కూటమి సర్కార్ కొలువు తీరాక ఎలా కంట్రోల్ లో ఉందో జనాన్ని అడిగితే చెబుతారని అన్నారు.
రాజీనామా చేయాలో లేదో అనేది కాలమే నిర్ణయిస్తుందని, అయినా ఇది డీఎన్ఏ సర్కార్ కాదని ఎన్డీయే ప్రభుత్వమని గుర్తు పెట్టుకుంటే మంచిదంటూ సెటైర్ వేశారు వంగలపూడి అనిత.