రేయింబవళ్లు పని చేస్తున్నాం – మంత్రి
ఏపీ మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – రేపటి నుంచి భారీ వర్షాలు, వరద నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ప్రారంభమవుతోందని పేర్కొన్నారు ఏపీ మంత్రి వంగలపూడి అనిత. వరద బాధితులకు 8 రోజులుగా ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నామని చెప్పారు.
పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని చెప్పారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారని తెలిపారు.
ధరల నియంత్రణపై దృష్టి పెట్టి రాయితీపై కూరగాయల విక్రయాలు చేస్తున్నామని చెప్పారు వంగలపూడి అనిత. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులకు పులిహార ప్యాకెట్లు కూడా పంచని గత ప్రభుత్వ నాయకుడు పులిహోర కబుర్లు చెప్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
పాస్ పోర్ట్ వచ్చి ఉంటే జగన్ ఈపాటికి లండన్ వెళ్లి పోయే వారంటూ మండిపడ్డారు వంగలపూడి అనిత. ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై విచారణ జరుగుతోందని అన్నారు. గణేష్ మండపాలకు సంబంధించి ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు.
.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూస్తున్నారని అన్నారు. అందరికీ సహాయం అందాలని సీఎం చంద్రబాబు కలెక్టరేట్లోనే ఉండి సమీక్షిస్తున్నారని తెలిపారు వంగలపూడి అనిత.