వరద బాధితులకు అనిత అండ
బుడమేరు గండి పనుల పరిశీలన
విజయవాడ – వర్షాలు ఇంకా తగ్గక పోవడంతో ఏపీ తల్లడిల్లుతోంది. మరో వైపు ప్రభుత్వం సహాయక చర్యలలో నిమగ్నమైంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రులు , ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గురువారం ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని శాంతినగర్ వద్ద ఆకువాని చెరువుకు పడిన గండిని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడుతో కలిసి పరిశీలించారు వంగలపూడి అనిత. నీరు ప్రవహించి ప్రజా జీవనం స్తంభించకుండా సత్వరమే గండిని పూడ్పించేందుకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
.వరద బాధితులకు అండగా నిలుస్తూ..సర్వం కోల్పోయామంటూ చెమర్చుతున్న కళ్లను ఓదారుస్తూ..మళ్లీ నిలబడే వరకూ ప్రభుత్వం ఊతంగా ఉంటుందని ధైర్యమిచ్చే ప్రయత్నం చేశారు వంగలపూడి అనిత.
..పారిశుద్ధ్య పనులను యుద్ధప్రాతిపదికన చేయిస్తూ..భవానీపురానికి బాసటగా నిలిచారు రాష్ట్ర హోం శాఖ మంత్రి. పనులను పరిశీలించిన అనంతరం వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. సాద్యమైనంత త్వరలో ఏపీ కోలుకుంటుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. 70 ఏళ్లు పైబడినా చెక్కు చెదరకుండా చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తున్నారని చెప్పారు .