వారణాసిలో నాదే గెలుపు
కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్
ఉత్తర ప్రదేశ్ – మోదీ సర్కార్ , బీజేపీ అనుబంధ సంస్థలు ఎన్ని రకాలుగా చేసినా గెలిచేది తానేనంటూ సంచలన కామెంట్స్ చేశారు యూపీలోని వారణాసి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్ . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాను కాశీకి చెందిన వాడినని, కాశీలోని ప్రతి వీధి, ఇల్లు , వ్యక్తులు తనకు తెలుసని పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ 10 లక్షల ఓట్లను దాటుతుందా లేదా అంతకు మించి స్థాయిలో ఓడి పోతుందా అన్నది త్వరలోనే తేలి పోతుందన్నారు అజయ్ రాయ్. దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు.
కులం, ప్రాంతం, మతం పేరుతో మనుషుల మధ్య విభేదాలు సృష్టించి ఓట్లు దండు కోవాలని చూస్తోందంటూ ధ్వజమెత్తారు అజయ్ రాయ్. చివరకు ఈ దేశానికి కావాల్సింది ప్రేమే గెలుస్తుందన్నారు. నిరంతరం ద్వేషాన్ని ఎగదోస్తూ పబ్బం గడుపుకునేలా చేయడం దారుణమన్నారు అజయ్ రాయ్.