షర్మిల వల్లనే జగన్ జైలుకు – వరుదు కళ్యాణి
సంచలన ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ
విశాఖపట్నం – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, శాసన మండలి సభ్యురాలు (ఎమ్మెల్సీ) వరుదు కళ్యాణి. ఆమె మీడియాతో మాట్లాడారు.
జగన్ మోహన్ రెడ్డిని కావాలని బద్నాం చేసే ప్రయత్నంలో భాగంగానే షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారో ప్రజలకు బాగా తెలుసన్నారు.
ప్రతి కుటుంబంలో ఆస్తుల తగాదాలు, సమస్యలు వస్తాయని వాటిని ఎవరంతకు వారే పరిష్కరించు కుంటారని కానీ ఇందులో ఎలాంటి సంబంధం లేదని నారా చంద్రబాబు నాయుడు, ఆయన పరివారం ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించారు వరుదు కళ్యాణి.
విచిత్రం ఏమిటంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నమోదు చేసిన కేసుల్లో భారతీ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని షర్మిలమ్మ అడుగుతున్నారని , ఆమె పేరు కూడా ఉందని, కానీ షర్మిల పేరు లేదని ఆ విషయం తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు.
దీన్ని బట్టి అర్థం ఏమిటంటే ఆ ఆస్తులతో వైఎస్ షర్మిలకు సంబంధం లేనట్టే కదా అని ప్రశ్నించారు. ఆనాడు కేసుల్లో వైయస్ఆర్ పేరు చేర్చింది పొన్నవోలే అంటూ నిస్సిగ్గుగా షర్మిలమ్మ అబద్ధాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు. షర్మిలమ్మ కారణంగానే వైఎస్ జగన్ రెడ్డి కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు వరుదు కళ్యాణి.