SPORTS

తిప్పేసిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి

Share it with your family & friends

కోల్ క‌తా ద‌ర్జాగా ప్లే ఆఫ్స్ లోకి

కోల్ క‌తా – ఐపీఎల్ 2024లో ముంబై ఇండియ‌న్స్ ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో చేతులెత్తేసింది. 18 ప‌రుగుల తేడాతో ఓటమి పాలైంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ క‌తా నిర్ణీత 16 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 157 ర‌న్స్ చేసింది. వెంక‌టేశ్ అయ్య‌ర్ , నితీశ్ రాణా రాణించారు. తొలుత వ‌ర్షం ఆటంకం క‌లిగించ‌డంతో అంపైర్లు మ్యాచ్ ను 16 ఓవ‌ర్ల‌కు కుదించారు. .

వెంక‌టేశ్ అయ్య‌ర్ 21 బాల్స్ ఎదుర్కొని 6 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 42 ర‌న్స్ చేస్తే నితీశ్ రాణా 23 బంతులు ఆడి 4 ఫోర్లు 1 సిక్స‌ర్ తో 33 ర‌న్స్ చేశాడు. అనంత‌రం మైదానంలోకి దిగ‌న ముంబై 16 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 139 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

ప్ర‌ధానంగా ముంబైని శాసించారు కోల్ క‌తా బౌల‌ర్లు. స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి కేవ‌లం 17 ప‌రుగులు మ‌త్ర‌మే ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. ఆండ్రూ ర‌స్సెల్ 34 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక ముంబై జ‌ట్టులో ఇషాన్ కిష‌న్ ఒక్క‌డే 40 ర‌న్స్ చేసి రాణించినా ఫ‌లితం లేకుండా పోయింది.