వరుణ్ గాంధీకి కాంగ్రెస్ వెల్ కమ్
క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు
న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీ క్లీన్ ఇమేజ్ కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన వరుణ్ గాంధీకి టికెట్ ఇవ్వక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు , ఎంపీ అధీర్ రంజన్ చౌదరి. ఇదిలా ఉండగా బీజేపీలో ఉంటూ ఆ పార్టీ, మోదీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను తీవ్రంగా తప్పు పట్టారు వరుణ్ గాంధీ.
అంతే కాదు తమ న్యాయ పరమైన డిమాండ్లు పరిష్కరించాలని, తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ పోరాటం చేసిన రైతులకు బేషరతుగా మద్దతు పలికారని గుర్తు చేశారు అధీర్ రంజన్ చౌదరి.
ఒక రకంగా చెప్పాలంటే వరుణ్ గాంధీతో పాటు మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ బీజేపీలో కంటగింపుగా మారారు. బహిరంగంగానే నరేంద్ర మోదీ, అమిత్ చంద్ర షాలను ఏకి పారేశారు. చివరకు ఆ ఇద్దరిపై బీజేపీ కక్ష కట్టింది. ఈ తరుణంలో తాజాగా ప్రకటించిన ఎంపీ జాబితాలో బీజేపీ మొండి చేయి చూపించింది వరుణ్ గాంధీకి.
ఈ సందర్బంగా మంగళవారం అధీర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడారు. వరుణ్ గాంధీ తమ పార్టీలోకి వస్తామంటే తాము పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ప్రకటించారు.