NEWSANDHRA PRADESH

వరుణ్ తేజ్ కు గ్రాండ్ వెల్ క‌మ్

Share it with your family & friends

అభిమానుల కోలాహ‌లం

రాజ‌మండ్రి – మెగా ఫ్యామిలీకి చెందిన ప్ర‌ముఖ న‌టుడు వ‌రుణ్ తేజ్ ఆస‌క్తిక‌రంగా మారారు . ఆయ‌న త‌న తండ్రి నాగ‌బాబు, బాబాయి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మ‌ద్దతుగా ప్ర‌చారంలో పాల్గొనేందుకు శ‌నివారం రాజ‌మండ్రికి చేరుకున్నారు.

ప్ర‌స్తుతం జ‌న‌సేనాని పిఠాపురం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూట‌మి త‌ర‌పున అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్నారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారంలో పాల్గొనేందుకు ఇక్క‌డికి విచ్చేశారు. ఇక్క‌డ ఎయిర్ పోర్టుకు చేరుకున్న వ‌రుణ్ తేజ్ కు గ్రాండ్ వెల్ క‌మ్ ల‌భించింది.

చిరంజీవి యువత అభిమాన సంఘాల నాయకులు ధర్మేంద్ర, బాబీ ఏడిద నేతృత్వంలో అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. వరుణ్ తేజ్ గారు గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం మొదలు పెట్టి వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి మీదుగా దుర్గాడ చేరుకుంటారు. ఎన్నికల ప్రచార ర్యాలీ, రోడ్ షో, సమావేశాల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

మ‌రో వైపు ఏపీలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం మొద‌లైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగుతోంది.