జగన్ కు జ్ఞానోదయం కాలేదు
మంత్రి వాసం శెట్టి సుభాష్
అమరావతి – ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు కొత్తగా ఏపీ మంత్రిగా కొలువు తీరిన వాసం శెట్టి సుభాష్. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ తెలిపారు.
కూటమి సర్కార్ ఎవరిపై కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలందరతో కలిసి పని చేస్తామని అన్నారు . జగన్ నిర్వాకం కారణంగా అన్ని వ్యవస్థలు కునారిల్లి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక్కడికి రావాల్సిన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోయాయని, దీనికి ప్రధాన కారకుడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డినేంటూ ధ్వజమెత్తారు. రూ. 3000 వేల కోట్లు భవన నిర్మాణ కార్మికుల నిధులు .వైసీపీ పార్టీ , పథకాల కోసం మళ్ళించారని ఆరోపిచంఆరు. వైసీపీకి ఘోరంగా ఓటమి దక్కినా ఇంకా జగన్ రెడ్డికి జ్ఞానోదయం కాలేదన్నారు.