పరిశ్రమల ఏర్పాటుకు కోనసీమ బెటర్
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
అమరావతి – పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కోనసీమ అద్భుతమైన ప్రాంతమని స్పష్టం చేశారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఆదివారం మంత్రి కోనసీమ ప్రాంతంలో పర్యటించారు. రాష్ట్రంలో తొలిసారిగా రామచంద్రపురం లో స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ కోనసీమ అవగాహనా ప్రోగ్రాం ను లాంచ్ చేశామన్నారు. వ్యవసాయ ఆధారిత, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు ఇక్కడి ప్రాంతం పూర్తిగా అనుకూలంగా ఉంటుందన్నారు. దీని వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు యువ పారిశ్రామిక వేత్తలను తయారు చేయడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు వాసంశెట్టి సుభాష్ .ప్రతి నియోజకవర్గం లో MSME పార్క్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవగాహన శిబిరంలో పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు కావాల్సిన తర్ఫీదు ఇవ్వడం జరుగుతోందన్నారు.
తాను రాజకీయాలకు కొత్త వాడినే కావచ్చని, కానీ సేవ చేసేందుకు మాత్రం పాత వాడినేనని అన్నారు వాసం శెట్టి సుభాష్. తనను తనను నమ్మి గెలిపించిన రామచంద్రాపురం ప్రజల కోసం అహర్నిశలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు.