నోటీసులు జారీ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుని కలిసి ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పట్ల మాజీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారి పేర్లు బయటకు చెప్పరాదని చట్టంలో ఉందన్నారు. అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. అలాంటి వారి పట్ల ఫోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ సీపీని కోరారు. ఈ మేరకు గోరంట్ల మాధవ్ కు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్లారు. బీఎన్ఎస్ సెక్షన్ 35/3 కింద గోరంట్లకు నోటీసులు ఇచ్చారు. మార్చి 5న సీసీ పీఎస్ కు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్ 2న సైబర్ క్రైమ్ పీఎస్ లలో ఎంపీపై ఫిర్యాదు చేశారు మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. పోక్సో కేసులో బాధితురాలి పేరు చెప్పారని ఆరోపించారు.