విజయమ్మకు వైసీపీ పగ్గాలు ఇవ్వాలి
వాసిరెడ్డి పద్మ విజయ సాయికి సూచన
అమరావతి – వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ విజయమ్మకు వైసీపీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎంపీ విజయ సాయిరెడ్డి జగన్ రెడ్డికి సలహా ఇవ్వాలని సూచించారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును మార్చాలని సలహా ఇస్తున్న విజయ సాయిరెడ్డి ముందు మీ నాయకుడికి ఆ సలహా ఇస్తే మంచిదని పేర్కొన్నారు.. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ను కలిసిన వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు.
జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్ లో విజయ సాయి రెడ్డి చిల్లర రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోఇపంచారు. రాష్ట్ర ప్రజలు విజ్ఞత కలిగిన వారని ఓటమి తరువాత కూడా వైసీపీ బుద్ధి మారటం లేదని పద్మ విమర్శించారు.
ఇతర పార్టీలకు సలహాలు ఇచ్చేముందు ప్రజా నమ్మకం కోల్పోయిన జగన్ పార్టీ బాధ్యతల నుండి తప్పుకుని విజయమ్మకు పగ్గాలు అప్ప చెప్పాలని అన్నారు. వైసీపీ నాయకుల పాపాల పుట్టలు బద్దలవటంతో దిక్కుతోచక డైవెర్షన్ కోసం కూటమి ప్రభుత్వంలో చిచ్చుపెట్టాలని విజయసాయి రెడ్డి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నాడని ఆరోపించారు వాసిరెడ్డి పద్మ.