త్వరలో టీడీపీలోకి వాసిరెడ్డి పద్మ
వైసీపీకి గుడ్ బై తెలుగుదేశానికి జై
ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 9వ తేదీన మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఇవాళ పద్మ ఎంపీ కేశినేని చిన్నిని కలిశారు. రాజకీయ పరిణామాలపై చర్చించారు.
ఇదిలా ఉండగా వాసిరెడ్డి పద్మ స్వస్థలం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర కంభంపాడు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా పని చేశారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, 2012లో జగన్ రెడ్డి పార్టీకి చెందిన వైసీపీలో చేరారు. అక్కడ కూడా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.
జగన్ ఆమెకు కీలకమైన పదవిని కట్టబెట్టారు. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. అనుకోకుండా ఏపీలో టీడీపీ కూటమి సర్కార్ కొలువు తీరింది. ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.