బాబు నిర్వాకం పద్మ ఆగ్రహం
సంక్షేమం జగన్ రెడ్డి ఆశయం
తాడేపల్లి గూడెం – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
లబ్దిదారులకు సాయం అందకుండా అడ్డు కోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు. వయసు పెరిగినా బుద్ది మాత్రం మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వాసిరెడ్డి పద్మ.
ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తమ నాయకుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్లారని స్పష్టం చేశారు. చంద్రబాబు తన పాలనా కాలంలో ఏపీకి ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
అమరావతి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు. లక్ష కోట్ల అప్పులు చేసి ఏపీ ప్రజల మీద భారం మోపాడని , ఆయనకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు వాసిరెడ్డి పద్మ. ఎన్నికల సంఘానికి ఎందుకు ఫిర్యాదు చేశారో ప్రజలకు చెప్పాలన్నారు.