ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కామెంట్స్
హైదరాబాద్ – ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్‌ప్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయాలని పిలుపునిచ్చారు. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టాలని సూచించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంత మొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పేర్కొన్నారు.ఓ ఛానల్ లో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి ఇంటర్వ్యూ ఇవ్వడంపై మండిపడ్డారు. తను బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. చేస్తున్నదే తప్పు..అదేదో సంఘ సేవ చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం దారుణమని పేర్కొన్నారు.
బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలై పోతున్నా కనీసంం పశ్చాతాపం చెందక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలం నుంచి బెట్టింగ్ యాప్స్ పట్ల తీవ్రంగా స్పందిస్తూ వస్తు్నారు ఎండీ సజ్జనార్. డబ్బే సర్వస్వం కాదని , అది జీవితం అనుకుంటే రాణించ లేరని పేర్కొన్నారు. ప్రధానంగా యువత తమ ప్రయాణంలో చదువుపై ఎక్కువగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఏదో ఒక రోజు శిక్షకు గురవుతారని హెచ్చరించారు. ఏ పని చేసినా, ఏ వీడియో తీసినా సమాజానికి ఉపయోగపడేలా ఉండేలా తప్పా చెడి పోయేలా ఉండ కూడదని పేర్కొన్నారు ఎండీ వీసీ సజ్జనార్.