NEWSTELANGANA

దాడులు చేస్తే ఆస్తులు జ‌ప్తు

Share it with your family & friends

వార్నింగ్ ఇచ్చిన స‌జ్జ‌నార్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. గ‌త కొన్ని రోజుల నుంచి ఆర్టీసీ బ‌స్సుల‌ను కొంద‌రు కావాల‌ని టార్గెట్ చేయ‌డా్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

ఆర్టీసీ బ‌స్సులు ప్రైవేట్ ఆస్తులు కావ‌ని అవి పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలోని నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జ‌ల‌కు చెందిన‌వ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధానంగా ప్ర‌తి రోజూ ల‌క్ష‌లాది మంది ప్ర‌యాణీకుల‌ను సుర‌క్షితంగా త‌మ త‌మ గమ్య స్థానాల‌కు చేర‌వేయ‌డంలో కీల‌క‌మైన పాత్ర ఆర్టీసీ పోషిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదే స‌మ‌యంలో ఏదో ఒక కార‌ణం చూపి దాడుల‌కు దిగ‌డం, బ‌స్సుల‌ను ధ్వంసం చేయ‌డం ప‌రిపాటిగా మారింద‌ని అన్నారు. ఎవ‌రు దాడి చేసినా , వారు ఏ పార్టీకి చెందిన లేదా ఇత‌ర వ‌ర్గాల‌కు చెందినా విడిచి పెట్టే ప్ర‌సక్తి లేద‌ని హెచ్చ‌రించారు. వారిని గుర్తించి, కేసులు న‌మోదు చేయ‌డ‌మే కాదు బ‌స్సుల డ్యామేజ్ కు సంబంధించి వారి ఆస్తుల‌ను జ‌ప్తు చేస్తామ‌ని హెచ్చ‌రించారు స‌జ్జ‌నార్.