NEWSTELANGANA

ఈవీఎంల‌ను ర‌ద్దు చేయాలి

Share it with your family & friends

వీసీకే పార్టీ చీఫ్ తిరుమావ‌ళ‌వ‌న్
హైద‌రాబాద్ – ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు వీసీకే పార్టీ చీఫ్ డాక్ట‌ర్ తొల్ తిరుమావ‌ళ‌వ‌న్ . రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడు కునేందుకు ఈవీఎంల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.

హైద‌రాబాద్ లో తొల్ తిరుమావ‌ళ‌వ‌న్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం బిజెపి పాలనలో ప్రమాదంలో పడ్డాయని అన్నారు. బిజెపి ఈవీఎంల‌ను దుర్వినియోగం చేస్తోంద‌ని ఆరోపించారు, కనీసం వివిప్యాట్లను వంద శాతం లెక్కించాలని డిమాండ్ చేశారు.

దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న సిఎఎను రద్దు చేయాలని అన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా మూకలను ఉసి గొల్పడానికి బిజెపి ప్రయత్నం చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. బిజెపిని ఓడించడానికి తెలంగాణ రాష్ట్రంలో త‌మ పార్టీ పోటీ చేస్తోంద‌న్నారు.

సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల అభ్యర్థులను ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి తెలంగాణ శ్యామ్, మల్కాజ్‌గిరి నుంచి మంచింటి అంజనేయులు, నాగర్ కర్నూల్ నుంచి భారతి విసికె పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు తొల్ తిరుమావ‌ళ‌వ‌న్ వెల్ల‌డించారు.

వీసీకే తెలంగాణ రాష్ట్ర చీఫ్ డాక్ట‌ర్ జిలుక‌ర శ్రీ‌నివాస్ నిప్పులు చెరిగారు. ఈ దేశంలో ఉన్న వ‌న‌రుల‌ను గంప గుత్త‌గా తాబేదారుల‌కు, బ‌డా బాబుల‌కు, వ్యాపార‌వేత్త‌ల‌కు మోదీ దార‌ద‌త్తం చేసే ప‌నిలో బిజీగా ఉన్నారంటూ మండిప‌డ్డారు.

జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో వీసీకే పార్టీ కీల‌కంగా మార బోతోంద‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీకి చెందిన శ్రేణులు గెలుపు కోసం కృషి చేయాల‌ని కోరారు.