మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ
కర్ణాటక – మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రానికి ఏదో ఒక రోజు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం కావడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తనకు అన్ని విధాలుగా అర్హతలు , అనుభవం ఉందన్నారు. అయితే ముఖ్యమంత్రి పీఠం మీద ఎప్పుడు కూర్చుంటారనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.
ఇదిలా ఉండగా వీరప్ప మొయిలీ చేసిన తాజా కామెంట్స్ కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం సీఎంగా సిద్దరామయ్య ఉన్నారు. దీనిపై ఇంకా స్పందించ లేదు సీఎం. ఓ స్కాం విషయంలో సిద్దరామయ్య, భార్య తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ తరుణంలో వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లయింది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. అంతులేని హామీలను ఇచ్చింది. ఉచిత బస్సు ప్రయాణం గుది బండగా మారింది. ఇదే సమయంలో సీఎం ఎంపిక విషయంలో ఏఐసీసీ ఆచి తూచి అడుగు వేసింది. సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు డీకే శివకుమార్. కానీ ఆయనపై కేసులు ఉండడంతో సౌమ్యుడిగా పేరు పొందిన సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది.