NEWSTELANGANA

మ‌ధ్య ద‌ళారుల మాట‌లు న‌మ్మ‌కండి

Share it with your family & friends

ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వేం న‌రేందర్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఆదివారం ఆయ‌న మ‌ధ్య ద‌ళారుల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌న పేరు చెప్పి కొంద‌రు మోసం చేస్తున్న‌ట్లు త‌న దృష్టికి వ‌చ్చింద‌ని తెలిపారు. ద‌య‌చేసి త‌న‌కంటూ ఎలాంటి గ్రూప్ లేద‌ని పేర్కొన్నారు.

కొంద‌రు వ్య‌క్తులు త‌న పేరు ఉప‌యోగించ‌డం, ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం త‌న దృష్టికి వ‌చ్చింద‌ని తెలిపారు వేం న‌రేంద‌ర్ రెడ్డి. డబుల్ బెడ్ రూమ్ లు ఇప్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్లు చేయిస్తామ‌ని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయ‌డం త‌న‌ను విస్మ‌యానికి గురి చేసింద‌ని తెలిపారు.

ఈ విష‌యం తెలుసుకున్న తాను వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింద‌న్నారు వేం న‌రేంద‌ర్ రెడ్డి. వెంట‌నే తాను రాచ‌కొండ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని తెలిపారు. కావున ఇక నుంచి ఎవరైనా నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లయితే చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చ‌రించారు.

ప్రజలు కూడా ఇలాంటి మోస పూరిత వ్యక్తుల మాటలు నమ్మవద్దని కోరారు. మళ్ళీ అలాంటి కాల్స్ వస్తే త‌మ‌ ఆఫీస్ సిబ్బందిని సంప్రదించాల‌ని లేదా వాట్సాప్ నెంబ‌ర్ 7566663335 కు ఫిర్యాదు చేయాల‌ని సూచించారు వేం న‌రేంద‌ర్ రెడ్డి.