భక్తులకు ఇబ్బందులు లేకుండా చేస్తా
టీటీడీ బోర్డు సభ్యురాలు ప్రశాంతి రెడ్డి
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొలువు తీరారు. ఈ సందర్బంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తానని స్పష్టం చేశారు.
టిటిడి ఛైర్మన్ బి.ఆర్ నాయుడు, ఇతర సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు నా తనయులు అర్జున్‌రెడ్డి, నీలిమారెడ్డి పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
తిరుమలలో ఎక్కడా సామాన్య భక్తులకు ఇబ్బందులు ఉండకుండా చూస్తానని హామీ ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు చెప్పారు.