కౌశిక్ రెడ్డిపై వీరేశం కన్నెర్ర
స్పీకర్ ను అవమానిస్తే ఎలా
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇవాళ తను అసెంబ్లీకి తాగి వచ్చాడని ఆరోపించారు. సభలో దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను గులాబీ ఎమ్మెల్యేలు కావాలని అవమానించారని వాపోయారు.
తెలంగాణ శాసన సభలో ఇది చీకటి రోజుగా మిగిలి పోతుందన్నారు. కౌశిక్ రెడ్డికి నర నరాన కుల అహంకారం ఉందని మండిపడ్డారు. ముఖ్యంగా బీసీలంటే, ఎస్సీ, ఎస్టీలంటే గౌరవం లేదన్నారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులంటే పూర్తిగా వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వేముల వీరేశం.
నిండు సభలో చిల్లర వేషాలు వేస్తూ స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన పాడి కౌశిక్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. మిగతా ఎమ్మెల్యేలకు ఓ హెచ్చరికగా ఉంటుందన్నారు.